Wednesday, February 13, 2008

దేవుడు చేసిన ఉపకారములను మరువవద్దు.

మనము దేవుడు చేసిన మేలులను ఏ విధంగా మర్చిపొతున్నాము అనె విషయమై ఈ కధ ఒక ఉదహరణ దీనిని మన నిజ జీవితంలోకి అన్వదించుకొని చూస్తే మనం ఎంత పెద్ద తప్పు చేస్తున్నామొ తెలుస్తుంది.
ఒక రాజు శత్రురాజు చేతికి పట్టబడ్డాడు,అతన్ని కోట పైన బంధించారు.శత్రువుల చేతిలొనుండి ఎలాగైనా సరె తప్పించుకోవాలని మన రాజు గారి ప్రయత్నం, అ ప్రయత్నంలొ రాజుగార్కి క్రింద ఒక వ్యక్తి కనబడ్డాడు ఆ వ్యక్తి పరిస్థితి అప్పుడు బాగా త్రాగి ఉగుతున్నడు. అతను త్రాగిన విషయం మన రాజు గార్కి తెలియదు. మన రాజు గారు ఆ వ్యక్తి దృష్టిని పైకి మళ్ళించాలని ప్రయత్నిస్తు ఎన్నొ సైగలు చేసాడు. కాని ఆ త్రాగుబోతుకు అవి కనబడలేదు వినబడలేదు,ఇది కాదు మార్గం అనుకొని అతి విలువైన వజ్రములతొ పొదిగిన తన చేతి కంకణమును తీసి క్రింద పడవేసెను. అది చూచిన ఆ త్రాగుబోతు త్వరత్వరగా దానిని తీసుకొని తన జేబులొ వెసుకొని ఇంకా ఎమైనా దొరకునా అని క్రింద వెదకుట ప్రారంభించెను కాని, అది ఎక్కడ నుండి వచ్చింది ఎలా వచ్చింది అని తన దృష్టిని పైకి మరల్చలేదు.
"ఓ బాబూ! అవి ఇచ్చింది నేను నా వైపు చూడు" అని పైన సైగలు చేస్తున్న రాజు వైపు చుడటం లేదు.ఎలాగైన సరె అతని చూపుని పైకి మరల్చాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నా రాజు గారు మరొ కంకణాన్ని కూడ క్రిందికి వెసాడు. దాన్ని కూడ మన త్రాగుబోతు గారు తీసుకొని జేబులొ వెసుకుని ఇంకా ఎమైనా దొరుకుతుందా అని వెతుకుతున్నాడు. ఇంకా ఇలా కాదు అని అనుకొన్న రాజు గారు అక్కడె ఉన్న ఒక రాతిని తీసుకొని అతని వైపు బలంగా కొట్టాడు, అది టపి మని తగలడంతొ "అమ్మ" అని అప్పుడు పైకి చూసాడు.
మనలొ చాలా మంది ఇలాగె ఇలాంటి త్రాగుబోతుల మాదిరిగా ఉన్నారు చాల మంది దేవుడు ఎక్కడ? అని కొందరు, దేవుడు లేడు అని కొందరు దేవుడు ఉన్నడు అని తెలిసి భయం,సిగ్గు,అన్ని గాలికి వదిలేసి కృతజ్ఞ్ తా లేకుండా తిరుగుతున్నారు,మనలొ చాలా మంది దేవుడిచ్చిన మేలులను పొంది దానికి కనీసం థ్యాంక్స్ అని కూడా చెప్పని వారు లక్షకు తొంభైవేలు అని అంటె అశ్చర్యం లేదు, వారి ధనం, బలం, సామార్ధ్యం, తెలివి వీటిని బట్టి గర్విస్తు వాటిని ఇంకా సంపాదించుకోవడనికి అనేక వ్యయ ప్రయసాలు పడుతున్నారు. కాని వాటిని, వాటికంటె మహొన్నతమైనవాటిని ఇచ్చె దేవుడు మనకు కలడు అని గుర్తించలేకపొవుట ఎంత సిగ్గు చేటు. కాని అదే మన ఆరోగ్యం బాగొ లేకపొతెనొ లేక మన రక్తసంభంధితులా ఆరోగ్యం బాగొ లేకపొతెనొ మన ఆర్ధిక స్థితి బాగొ లేకపొతెనొ "దేవుడా! నేను ఎమీ పాపం చేసాను" అని అంటాం. తప్పు ఇక్కడె మొదలౌతుంది, ఎలా అంటె మనము దేవుడు చేసిన మేళ్లను మరువక కృతగ్నత కలిగి అయనను స్తుతిస్తూ అయన దెబ్బలు తప్పించుకొవచ్చు.
"నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు?"(యెషయా 1:5)ఈ నూతన వత్సరములో ప్రభువు చేయుచున్న మేళ్ళకై అయనకు వందనములు స్తుతులు చెల్లించుదము.నా ప్రాణమా, యెహోవను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము" (కీర్తన 103:2)
కోసమెరుపు: మనము దేవుడ్ని గుర్తించట్లేదు అని మనకు దేవుడు గుర్తించేలా చేసినందుకు కూడ దేవునికి వందనాలు చెబితె మరి మంచిది.
నీతి: మనకు సహయం చేసింది పిల్లవడైన దేవుడైన ఒక్కటె. వారికి తగు విధంగ థ్యాంక్స్ చెప్పడం మన కర్తవ్యం.

No comments: